Skip to main content

An appeal to all teachers

Material (DSC & Model Schools) స్టడీ మెటీరియల్

DSC మరియు మోడల్ స్కూల్ పరీక్షలకు 'English Content & Methodology' స్టడీ మెటీరియల్ కావలసిన వారు వెంటనే సంప్రదించండి. Koti ( Jyotsna Xerox, 2/3, Brodipet, Guntur, Cell : 9848526091 ) 


'CHILD DEVELOPMENT AND PEDAGOGY (ఇంగ్లీష్)' మరియు ' సోషల్ స్టడీస్' ఇంగ్లీష్ మీడియం మెటీరియల్ కూడా ఉంది. సంప్రదించగలరు: Koti ( Jyotsna Xerox, 2/3, Brodipet, Guntur, Cell : 9848526091 )

 నా మెటీరియల్ శాంపిల్:  దీన్ని క్లిక్  చేయండి  sample material 


DSC and Model School English, Psychology, Social Studies study material hand-written by me is available at Jyotsna Xerox, 2/3, Brodipet, Guntur. Contact Koti9848526091                            DSC-2012 English Question Paper 

                   DSC- 2014 English Question Paper               Model School 2012 PGT English Question Paper


             Model School 2012 TGT English Question Paper

               
  DSC కి సిలబస్ ఏమిటి?

DSC కి సిలబస్ ఏమిటి? ఈ ప్రశ్నచాలా మంది అభ్యర్ధుల మెదడు తొలుస్తుంది. 2012 DSC ను ప్రాతిపదికగా తీసుకుంటే అంతకు పూర్వం జరిగిన DSC లకు దీనికి చాలా తేడా వుంది.

2012 కు ముందు జరిగిన DSC లలో కేవలం టెక్స్ట్ బుక్స్ నుండి మాత్రమే ప్రశ్నలు వచ్చేవి. కానీ 2012 లో ట్రెండ్ మారింది. క్రొత్త సిలబస్ లో ముందు టాపిక్స్ ఇస్తున్నారు. ప్రతి టాపిక్ ని అభ్యర్ధులు 6 వ తరగతి నుండి PG వరకు ప్రిపేర్ అవ్వవలసి వుంటుంది. ఉదాహరణకు సోషల్ లో ‘వాతావరణం’ అనే టాపిక్ వుంది అనుకోండి. ఈ ‘వాతావరణం’ అనే టాపిక్ ను 6వ తరగతి నుండి PG వరకు ప్రిపేర్ అవ్వాలి. PG వరకు టెక్స్ట్ బుక్స్ తెచ్చుకుని వాటిని చదివి, టాపిక్ ప్రకారం నోట్సు ప్రిపేర్ చేసుకోవాలి. జనరల్ బుక్స్ మరియు రెఫెరెన్సు బుక్స్ కూడా చదవవలసిన అవసరం వుంటుంది. DSC లో వచ్చే ప్రశ్నల కాఠిన్యత PG వరకు వచ్చే సిలబస్ మీద ఆధారపడి వుంటుంది. ఎప్పుడు చదివిన టాపిక్ కు అప్పుడే నోట్సు తయారు చేసుకోవడం తప్పనిసరి. మీ వెంట ఇంటర్నెట్ పని చేసే సెల్ ఫోన్ వుంటే మరీ మంచిది. డౌట్స్ వుంటే వెంటనే క్లియర్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది.


                                    


D.S.C. మరియు మోడల్ స్కూల్స్ ఎగ్జామ్స్ కు ఎలా  ప్రిపేర్ కావాలి ?  


నేను డి.ఎస్.సి. కి , మోడల్ స్కూల్ ఎగ్జామ్స్ కి ఒకేసారి ప్రిపేర్ అయ్యాను . స్కూల్ అసిస్టెంట్ , పి . జి .టి . మరియు టి . జి . టి . మూడు జాబ్స్ ఒకే సారి సంపాదించగలిగాను . నేను ప్రిపేర్ అయిన పద్ధతిని దృష్టిలో పెట్టుకొని మీ ఉపయోగం కోసం కొన్ని సూచనలు ఇక్కడ పొందు పరుస్తున్నాను . 


ఏ పరీక్షకు ప్రిపేర్ అవ్వాలన్నా మనం ముందు గమనించవలసిన అంశం ఈ యజ్ఞం చెయ్యడానికి మనం రెడీ గా ఉన్నమా లేదా అని. ఆ తరువాత మనకు ప్రిపేర్ అవ్వడానికి తగిన సమయం ఉందో లేదో చూసుకోవాలి . డి.ఎస్.సి. సాధించాలంటే ముందు టెట్ లో మంచి మార్కులు సంపాదించాలి . నాలా లాంగ్వేజ్ అభ్యర్ధులకైతే సోషల్ స్టడీస్ మీద బాగా పట్టు సాధించవలసిన అవసరం ఉంటుంది . ఎంత కాదనుకున్నా ఈ టెట్ కు 6 నెలలు , డి.ఎస్.సి. కి మరో 6 నెలలు మొత్తం ఒక సంవత్సరం సమయం కేటాయించవలసి ఉంటుంది . అంత సమయం కేటాయించలేని వాళ్ళు ప్రిపేర్ అవ్వకపోవడమే మంచిది . 


మొట్టమొదట ప్రిపేర్ అవ్వడానికి మనం శారీరకంగా సిద్ధంగా ఉన్నామా లేదా అని చూసుకోవాలి . ఏ విధమైన తీవ్రమైన శారీరక వ్యాధులు ఉన్నా కష్టమే . అధిక బరువు ఉంటే వెంటనే తగ్గించుకోవాలి . 'బాడీ మాస్ ఇండెక్స్' ను ఎప్పుడూ సరిచూసుకోవాలి. ప్రతిరోజు ఉదయాన్నే ఒక గంట పాటు వ్యాయామం తప్పనిసరిగా చెయ్యాలి . ఆహారాన్ని  నియమబద్దంగా తీసుకోవాలి. 

మనం ప్రేపరషన్ కు మానసికంగా సిద్ధమా లేదా అనేది రెండవ అతిపెద్ద సమస్య. కుటుంబ సమస్యలు , నిరుత్సాహ పరిచే సంఘటనలు , వ్యాఖ్యల గురించి పట్టించుకోకూడదు. మనల్ని ఉత్సాహపరిచి, ధైర్యం ఇచ్చే వాళ్ళతోనే స్నేహం చెయ్యాలి . ఒడుదుడుకులు లేకుండా ఒక సంవత్సరం పాటు ఇంట్లో కూర్చొని చదవగలిగే విధంగా ఆర్ధిక వనరులు సమ కూర్చుకోవాలి . నేను ఈ జాబ్స్ కొట్టటానికి ఎక్కడికీ కోచింగ్ కు వెళ్ళలేదు . ఇంట్లో కూర్చొనే ఒంటరిగా చదివాను . మీకు నమ్మబుద్ది కావటంలేదు కదూ. ఇది నిజం . పై విషయాలన్నీ దృష్టిలో పెట్టుకున్న తరువాతే మీరు ప్రేపరషన్ కు కూర్చోవాలి . మరి ఎలా ప్రిపేర్ అవ్వాలి?1. ముందు ఇంటర్నెట్ నుండి డి.ఎస్.సి. లేదా టెట్ కు సంబంధించిన సిలబస్ ప్రింట్లు తీసుకోవాలి . ఈ ప్రింట్లు ఎప్పుడూ మనం చదివే ప్రదేశంలో అందికలో ఉంచుకోవాలి . 


2. వేరు వేరు సబ్జెక్టు లకు వేరు వేరు నోట్ బుక్స్ పెట్టుకోవాలి .

3. ప్రతి సబ్జెక్టు కు సంబంధించిన టెక్స్ట్ బుక్స్, రిఫరెన్స్ బుక్స్ రెండు మూడు కొనుక్కోవాలి . 

4. ఇంటర్నెట్ సదుపాయం ఉన్న సెల్ ఫోన్ ఒకటి ఎప్పుడూ దగ్గరలో ఉంచుకోవాలి . 

5. సిలబస్ లో ఉన్న మొదటి పాఠం తీసుకోండి . మొదటి పాఠం కు సంబంధించిన మేటర్ ను టెక్స్ట్ బుక్ లో చదవండి . ఆ తరువాత రిఫరెన్స్ బుక్ లో చదవండి . అది పూర్తిగా అవగాహన అయిందనుకున్న తరువాత రెండవసారి చదివే ముందు మీ నోట్స్ లో ఆ పాఠం పేరు వ్రాసుకోండి . టెక్స్ట్ బుక్ లో మొదటి పేరా చదివిన వెంటనే అందులోనుండి ఏమయినా బిట్స్ తయారు చేయవచ్చేమో చూడండి . అలా వరసగా బిట్స్ తయారు చేసుకొంటూ వెళ్ళండి . ఏమయినా డౌట్స్ వస్తే మీ సెల్ ఫోన్ లో నెట్ ద్వారా మీ డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు లేదా ఆ సబ్జెక్టు బాగా తెలిసిన వారి ద్వారా సందేహ నివృత్తి చేసుకోవచ్చు . 

6. మనం చదివిన విషయం సరిపోదనుకుంటే వెంటనే ఇంటర్నెట్ కు వెళ్లి ఆ చాప్టర్ కు సంభందించిన మెటీరియల్ ప్రింట్లు తీసుకు వచ్చి వాటిని చదవాలి . అందులో కూడా ఎమైనా బిట్స్ వస్తే తయారు చెయ్యాలి 

7. సైకాలజీ కి ఎక్కువ సమయం కేటాయించవలసి ఉంటుంది . 


8. ప్రతిరోజూ మూడు నాలుగు సబ్జెక్టు లు పైన చెప్పిన విధంగా ప్రిపేర్ కావాలి . ఒక సబ్జెక్టు లో ఒక పాఠం అయిపోగానే వేరొక సబ్జెక్టు తీసుకోవాలి . అలా మార్చి మార్చి చదివితే మనసు విసుగు చెందకుండా రిఫ్రెష్ అవుతుంది . 9. ఇలా ప్రతి రోజూ సుమారు 10 గంటలు ప్రిపరేషన్ సాగించాలి . పది గంటలకంటే తక్కువ సమయం కేటాయిస్తే మనం ఇబ్బందుల్లో పడ్డట్టే అని గమనించాలి . 


10. ఈ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు మనం ఎంత తేలికపాటి ఆహారం తీసుకుంటే అంత మంచిది. నిద్ర తెప్పించే ఆహార పదార్ధాలు పగటిపూట తీసుకోకండి . మధ్యాహ్నం ఒక గంటపాటు కునుకు తీయండి. రాత్రి పూట మాత్రం 7 నుండి 8 గంటల నిద్ర అవసరం . 

11. మీరు ఎగ్జామ్ కి ప్రిపేర్ అయ్యే ప్రదేశం ఎప్పుడూ ప్రశాంతంగా ఉండాలి . దగ్గరలో ఒకటి రెండు చెట్లు ఉండాలి . ఆక్సిజన్ ఎంత తీసుకుంటే అంత మంచిది కదా . 


12. ప్రతిరోజూ తప్పనిసరిగా ఒక తెలుగు మరియు ఒక ఇంగ్లీష్ దినపత్రిక చదవాలి . మాగజైన్లు రెండన్నా ఫాలో అయితే మంచిది. 


13. ప్రతిరోజూ ఉదయ్యాన్నే ఒక గంటపాటు వ్యాయామం చెయ్యడం మర్చిపోకండి . పగలు నిద్ర వస్తే రోజుకు రెండు మూడు సార్లు టీ లు త్రాగితే నిద్ర వదుల్తుంది . 

14. పరీక్షకు ఒక రోజు ముందు మీరు చదవడం ఆపేయాలి. సంపూర్ణ విశ్రాంతి తీసుకోవడానికి ప్రయత్నించండి. మంచి ఆహారం తీసుకోండి. బాగా నిద్ర పోవాలి. 

15. పరీక్ష కు ఒక గంట ముందే ఎగ్జాం సెంటర్ కు చేరుకోండి. బుక్స్ ఏమీ తీసుకెళ్ళకండి. బుక్స్ ఒక రోజు ముందే పక్కన పడేయాలి. అక్కడ కు బుక్స్ తెచ్చుకొని కుస్తీ పాడేవాళ్ళని చూసి మీరూ ఆదుర్దా పడకండి.16. ఎగ్జాం హాల్ లోకి వెళ్ళిన వెంటనే ప్రశాంతంగా మీ చోటులో మీరు కూర్చోండి. మీకు ప్రశ్నాపత్రం ఇచ్చే ఐదు నిమిషాల ముందు ప్రశాంతంగా కళ్ళు మూసుకొని కొద్ది సేపు మెడిటేషన్ చెయ్యండి. అప్పుడు మైండ్ బాగా ఫ్రెష్ అవుతుంది.


17. ముందు ఎగ్జాం పేపర్ అంతా చదివి మీకు బాగా వచ్చినవి టిక్ చేసుకోండి. వాటిని మొట్టమొదట ఆన్సర్ చెయ్యండి. రాని వాటి గురించి చివరలో నిదానంగా ఆలోచించవచ్చు.

ఈ పైన చెప్పిన విషయాలు మీకు ఉపయోగం అనిపిస్తే ఫాలో కండి . ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చెయ్యండి . సెల్: 7416438378. 
                                           *ఆల్  ది  బెస్ట్*                          

                                                 Study Material ( English ) for DSC and Model school PGT and TGT:


Pride and Prejudice 

The Guide    

THE FUNCTION OF CRITICISM                     The mother of prisoner number: 1084

The Solitary Reaper 

        
 A slumber did my spirit seal  
       
A Poison Tree

Ode To Autumn   

             
 Education of Nature  
                    
The Sun is Rising

Byzantiums


THE SECOND COMING


The Rime of the Ancient Mariner
The Last Bargain
For study material DSC SA (English), PGT(English) and TGT(English) prepared by a ranker, please contact Koti ( Jyotsna Xerox, 2/3, Guntur, Cell : 9848526091 )
  
 A sample of English Content
* Study material for Educational
  Psychology is also available.

* The study material is a hand-written notes prepared by me.Some useful links for Government-job-seekers:


Bibliomania


Booksonline


Flipkart 


Kiran Prakashan

PDgroup

Competition Review


Bright Publications


Careers 360


Arihant


Upkar


Competition master


Pearson

TaTa-Mcgrawhill

Know Your English

                               

                             

Popular posts from this blog

My portfolio

1. IRB Infra


2. Sanwaria


3. TATA Motors


4. TATA Global


5. Ashok Leyland


6. Gammon infra


7. 3i Infotech


8. Karuturi Global


9. Visagar Polytex


10.Welspun indiaVenugopal Bandlamudi
                         M.A., B.Ed.
www.thinkervenu.com

VENUGOPAL BANDLAMUDI., An Active Stock Market Investor & Certified Equity Research Analyst

Knowledge is Power 

Corruption has become the order of the day in all government offices in India. This is not good for this country. All the policy makers and people at large must take concrete action to root the corruption out of this country. Otherwise, there will be no future for this "Great" Nation.

"New-Zealand, Denmark, Norway, Finland and Switzerland are the cleanest countries in the world"
                 - Transparency International

https://twitter.com/thinkervenu
The stock market tips I have learned until now
1) Always buy quality stocks belonging to good companies

2) Buy only a few companies ( less than 10 )

3) Watch them daily

4) Don’t sell the stocks very often

5) Keep them with irrespective of market condition

6) Invest in them long term

7) Buying mutual funds is good, select equity growth option

8) Always maintain a record of closing prices of your stocks

9) Don’t watch too much of TV channels while market is open

10) Don’t be driven by rumors

11) Alwa…

Successfully crossed 100,000 mark

I have successfully accumulated more than 100,000 shares of ten different companies until now. I will add more shares to my kitty in the future if I have any money available with me. Further, I don't want to have more than ten companies at a time in my portfolio. I believe persistence and patience are keys to success in investing